Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బొమ్మ' తుపాకితో ఆడుకుంటూ చిన్నారి కాల్పులు... ఆస్పత్రి పాలైన తల్లి!

  • ఇంటి బయట గార్డెన్ లో దొరికిన తుపాకి 
  • బొమ్మగా భావించి కుమార్తెకు ఇచ్చిన మహిళ
  • ఆడుకుంటూ ట్రిగ్గర్ నొక్కిన బాలిక
ఇంటి బయట గార్డెన్ లో నిజమైన తుపాకి కనిపించగా, దాన్ని బొమ్మ తుపాకి అనుకుంది ఓ మహిళ. దాన్ని ఇంటికి తీసుకొచ్చి తన కూతురుకి ఇచ్చింది. ఆడుకుంటూ ఆ చిన్నారి తుపాకిని కాల్చడంతో బుల్లెట్లు తుపాకి నుంచి తల్లివైపు దూసుకుపోయాయి. తీవ్ర గాయాల పాలైన ఆమెను పొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హూగ్లీ జిల్లాలో ఆరంబాగ్ లో ఈ ఘటన నిన్న జరిగింది. బుల్లెట్లతో లోడ్ చేసి ఉన్న నిజమైన తుపాకిని బొమ్మ అనుకున్న కకోలి జాన తన కూతురుకు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే, లోడ్ చేసి ఉన్న తుపాకి గార్డెన్ లో దొరకడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
toy
gun

More Telugu News